ఎన్‌సీఎస్ యూజమాన్య భూములు వేలం వేస్తాం..

5 Sep, 2014 01:48 IST|Sakshi
ఎన్‌సీఎస్ యూజమాన్య భూములు వేలం వేస్తాం..

సీతానగరం: లచ్చయ్యపేటలోని ఎన్‌సీఎస్ సుగర్స్ యూజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి గురువారం చెప్పారు. లచ్చయ్యపేటలోని భూముల రికార్డులను అనుసరించి గురువారం సర్వే నిర్వహించి సుగర్స్‌కు చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ భూములను త్వరలో వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరకు రైతుల బిల్లుల బకారుులు చెల్లిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంత రైతులు 2013-14 క్రషింగ్ సీజన్‌లో చెరకు సరఫరా చేసినా యూజమాన్యం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేసిందన్నారు. అనేకసార్లు చర్చలు జరిపి మాటిచ్చి తప్పిందని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆస్తుల విక్రయూనికి సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆమె వెంట తహశీల్దార్ బి.సత్యనారాయణ, సబ్ రిజిస్ట్రార్ పి.బుచ్చినాయుడు, సుగర్ కేన్ సహాయ కమిషనర్ ముత్యాలు ఉన్నారు.
 
 రానున్న సీజన్‌లో క్రషింగ్ జరుపుతాం...
 రానున్న సీజన్‌కు సంబంధించి క్రషింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి రైతులకు భరోసా ఇచ్చా రు. తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె గురువారం చర్చించారు. అనంతరం మాట్లాడుతూ లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ యూజమాన్యం 1.5 లక్షల మంది రైతుల నుంచి చెరకు తీసుకుంటామని ఒప్పందం చేసుకుందన్నారు. క్రషింగ్ యూజమాన్యమే చేస్తుందని లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
 
 బిల్లులు చెల్లిస్తాం...
 సీతానగరం : ఎన్‌సీఎస్ సుగర్స్ కర్మాగారం రైతులకు చెల్లించాల్సిన బకారుులను సంస్థ భూములను విక్రరుుంచి చెల్లిస్తామని దీనిని గుర్తించి కర్మాగారం ఎదుట శుక్రవారం జరగనున్న ధర్నాలో ఎవరూ పాల్గొనవద్దని కలెక్టర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.
 

>
మరిన్ని వార్తలు