‘మాజీ’ల అర్జీలు పరిష్కరించాలి

30 Jan, 2014 02:23 IST|Sakshi

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కోసం మాజీ నక్సల్స్ చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన  పరిష్కరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. లొంగి పోయిన నక్సల్స్ పునరావాస పెండింగ్ అర్జీల పరిష్కారంపై కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్షించారు. స్వయం ఉపాధి పథకాల మం జూరు కోసం ఐటీడీఏ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, పశుసంవర్థక, రెవెన్యూ శాఖల వద్ద మాజీ నక్సల్స్  అర్జీలు పెండింగ్‌లో  ఉన్నాయన్నారు.

బ్యాంకు కాన్సెంట్ ఇవ్వకుండా గ్రౌం డింగ్ కాని  అర్జీలు 21 ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా అన్ని శాఖల వద్ద  ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు  మంజూరు చేయాలన్నారు. న క్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను లొంగిపోయిన నక్సల్స్‌తో భర్తీ చేసే అంశాన్ని పరీశీలించాలన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు స్వయం ఉపాధి కింద రుణాలు అందించేందు కు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ  12 మంది మాజీ నక్సల్స్‌కు వారంలోగా తక్షణ సహాయం అందిస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో లొంగుబాటుకు చాలామంది నక్సల్స్ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో లొంగుబాట్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చూస్తామన్నారు.  సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, మాజీ నక్సల్స్ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాన్నగారిలా సలహాలు ఇచ్చారు: సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైఎస్‌ జగన్‌ మరిన్ని సెంచరీలు చేయాలి: నరసింహన్‌

‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

ఆ విషయంలో రాజీ పడబోం : మంత్రి సురేష్

‘అవి బాహుబలి నియామకాలు’

‘దళితుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి’

‘చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు’

ఏపీ ఎస్సై ఫలితాలు: మహిళా టాపర్‌ ప్రజ్ఞ

గొలుసు.. మామూళ్లతో కొలుచు..!

టీడీపీ రాద్ధాంతంపై సీఎం ఆగ్రహం

‘మార్పు’ మంచిదేగా!

బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్టా?

‘టీడీపీ, జనసేన నుంచే ఎక్కువ’

సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి 

ప్రపంచ బ్యాంకు నిధులపై బుగ్గన కీలక ప్రకటన

భీతిగొల్పుతున్న విష సర్పాలు

‘లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు’

ఆ ఐదు గంటలు... క్షణమొక యుగంలా..

గొంతెండుతున్న మన్యం

వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకం

పబ్‌ జీ.. యే క్యాజీ..!

అక్రమార్కులకు హైకోర్టు నోటీసులు

వికటించిన ఇంజక్షన్‌..

లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు..

ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల

పెన్నమ్మే అమ్మ

బొమ్మలే బువ్వపెడుతున్నాయి

ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన

మరో చరిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4