వృద్ధులను నిర్లక్ష్యం చేయడం నేరమే

22 Aug, 2018 15:15 IST|Sakshi
వృద్ధులతో మాట్లాడుతున్న శ్రీహరి  

విజయనగరం లీగల్‌ : వృద్ధులను నిర్లక్ష్యం చేయడం చట్ట రీత్యా నేరమని, అందుకు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ కింద 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు పడతాయని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి తెలిపారు. మంగళవారం మండలంలోని పినవేమలి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలోని ఏబీసీడీ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వితంతువులు, వృద్ధులను పరామర్శించి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వృద్ధులకు అవసరమైన న్యాయ సహాయాన్ని డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి చేతి కర్రలు, చెప్పులు తదితర వస్తువుల కోసం సాంఘిక సంక్షేమ శాఖకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం కేర్‌ టేకర్‌ ఎ.విజయలక్ష్మి, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు