బోధనేతర పనులతో నాణ్యతకు విఘాతం

18 Jul, 2018 06:57 IST|Sakshi

తూర్పుగోదావరి : పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన మాకు బోధనేతర పనులను అప్పగిస్తున్నారు. దీంతో విద్యా బోధనలో నాణ్యత తగ్గిపోతోంది’’ అంటూ పాదయాత్రలో కరకుదురు వద్ద ఉన్న వైఎస్‌ జగన్‌కు ఉపాధ్యాయులు తమ సమస్యలను చెప్పుకున్నారు. రకరకాల సాఫ్ట్‌వేర్‌లను ప్రవేశపెట్టి వాటిలో డేటాను పంపించమంటున్నారని, ఆల్‌లైన్‌ వర్క్‌ భారంతో కొందరు ఉపాధ్యాయులు ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుందని అన్నారు. సాంకేతిక అంశాలకు సంబంధించి నిర్దిష్టమైన సిబ్బందిని నియమించేలా చూడాలన్నారు. బోధనేతర పనుల వల్ల విద్యార్థులపై దృష్టి సారించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆ భారాన్ని తొలగించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులు జగన్‌ను కోరారు.

మరిన్ని వార్తలు