రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!

24 May, 2020 08:53 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలు కనిపించడంలేదా..  

నెటిజన్ల మండిపాటు 

సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆమె చేస్తున్న దుష్ప్రచారంపై సీఐడీ కేసు నమోదుచేసి విచారణకు పిలిస్తే టీడీపీ అగ్రనేతలు రంగనాయకమ్మకు దన్నుగా నిలవడం చూస్తుంటే సర్కారుపై ఆ వర్గం కావాలనే బురదజల్లే కార్యక్రమం చేపట్టినట్లు అర్థమవుతోందని వారు తీవ్రంగా ఎండగట్టారు.

చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మీకు ఈ డ్రామాలు దేనికమ్మా అంటూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు శనివారం ముక్తకంఠంతో ప్రశ్నించారు. పేదలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడంలేదా అంటూ నిలదీశారు. పెద్ద వయస్సు అంటూ మీరు చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని. ఆ వయసులో ప్రభుత్వం మీద పోస్టింగులు ఎలా పెట్టారని ప్రశ్నించారు. 

చరిత్రలో ఇంత గొప్పగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకాలేమిటి? అంత గొప్ప నాయకుడైతే ఎందుకు చిత్తుగా ఓడాడు? అంటూ నిలదీశారు.  దేశ చరిత్రలోనే జగనన్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో 28 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీకి రంగం సిద్ధంచేసింది. ఏ రకంగా చూసుకున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అంటూ వివరించారు. 

మరిన్ని వార్తలు