‘05’ కాదు.. ఇకపై ‘04’

21 Jan, 2016 02:19 IST|Sakshi

 జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొత్త కోడ్
 
 అమలాపురం రూరల్ : ఇక నుంచి తూర్పుగోదావరి జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్  నంబర్ ఏపీ 04గా మారనుంది. రవాణాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్లను కొత్త కోడ్ సంఖ్యలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు సిద్ధం చేసింది. ఈ మేరకు జీఓ విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన 18 నెలల తరువాత కూడా ఏపీలో  వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్  నెంబర్లు పాత పద్ధతిలోనే అమలవుతున్నాయి. కొత్తగా రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పడిన తరువాత కోడ్ నంబర్ల మార్పు అనివార్యమైంది. దీనితో  మన రాష్ట్రంలోని 13 జిల్లాలకూ కొత్త కోడ్ సంఖ్యలను కేటాయిస్తూ రవాణా శాఖ చర్యలు తీసుకుంది.
 
 తూర్పుగోదావరి జిల్లా కోడ్ పాత పద్ధతిలో ఏపీ 05 కోడ్ నంబర్‌గా ఉండేది.  ఇక నుంచి  జిల్లాకు కొత్త  కోడ్ ఏపీ 04 కేటాయించారు. అనంతపురం పాత కోడ్ ఏపీ 02 కాగా  ఏపీ 01గా, చిత్తూరు పాత కోడ్ ఏపీ 03 కాగా ఏపీ 02గా,  కడపది ఏపీ 04 కాగా ఏపీ 03గా,  గుంటూరు కోడ్ ఏపీ 07 కాగా ఏపీ 05గా, కృష్ణా కోడ్ ఏపీ 16 కాగా ఏపీ 06గా, కర్నూలు కోడ్ ఏపీ 21 కాగా ఏపీ 07గా,  నెల్లూరు కోడ్ ఏపీ 26 కాగా ఏపీ 08గా, ప్రకాశం కోడ్ ఏపీ 27 కాగా ఏపీ09గా, శ్రీకాకుళం  కోడ్ ఏపీ 30 కాగా ఏపీ10గా, విశాఖ కోడ్ ఏపీ 31 కాగా ఏపీ11గా, విజయనగరం కోడ్ ఏపీ 35 కాగా ఏపీ 12గా,  పశ్చిమ గోదావరి కోడ్ ఏపీ 37 నుంచి ఏపీ13గా మారనున్నాయి. కొత్త కోడ్‌లు త్వరలో అమలు కానున్నాయి.

A

మరిన్ని వార్తలు