దుర్గగుడి పాలక మండలి నియామకం

21 Jun, 2017 20:16 IST|Sakshi

అమరావతి:  విజయవాడ శ్రీ దుర్గమలేశ్వర స్వామి వార్ల దేవస్థానం(దుర్గ గుడి) కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించిన ప్రభుత్వం వారందరి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సమావేశమై తమలో ఒకరిని చైర్మనుగా ఎన్నుకోవాల్సి ఉంది.

పాలక మండలి సభ్యులుగా యలమంచలి గౌరంగ బాబు, వెలగపూడి శంకరబాబు, బి. ధర్మారావు, కోడెల సూర్య లత కుమారి, ఈడి సాంబశివరావు, చెన్నుమోలు సాంబ సుశీల దేవి, పామర్తి విజయశేఖర్‌, జి. పద్మా శేఖరరావు, విశ్వనాథపల్లి పాప, సీహెచ్‌ లక్ష్మీ నరసింహరావు, బీరక పూర్ణ మల్లి రాంప్రసాద్‌, ఇట్టా పెంచలయ్య, డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం, పెద్దిరెడ్డి రాజా, వీరమాచినేని రంగ ప్రసాద్‌లను సభ్యులుగానూ, ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్‌. దుర్గాప్రసాద్‌ను ఎక్స్‌ ఆఫిషియో సభ్యునిగా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జి) డి. సాంబశివ  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలిలో సభ్యులుగా నియమించిన వారు రెండేళ్ల పాటు ఆ బాధ్యలలో కొనసాగుతారుని ఉత్తర్వులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు