డీఈఓగా నరసింహారావు

16 Nov, 2014 00:48 IST|Sakshi
డీఈఓగా నరసింహారావు

 భానుగుడి (కాకినాడ) : జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)గా ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో పని చేస్తున్న నరసింహారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీఈఓగా ఉన్న కేవీ శ్రీనివాసులురెడ్డి గుంటూరుకు బదిలీ అయ్యారు. శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి 2012-13లో రెండోస్థానంలో, 2013-14లో ప్రథమస్థానంలో నిలిచింది. రానున్న ఆ స్థానాన్ని నిలబెట్టడంలో డీఈఓ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతి విద్యార్థి పరీక్షల ఫలితాలు ఆన్‌లైన్లో ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచడం, డ్రాపవుట్లను, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడాన్ని నిరోధించడం, విధి నిర్వహణలో అలసత్వం వహించే ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, కోర్టు కేసులు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్, ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం వంటి పలు విషయాలు డీఈఓకు సవాళ్లు కానున్నాయి.
 

>
మరిన్ని వార్తలు