‘పంచాయతీ’కి కళొచ్చింది

3 Aug, 2013 06:09 IST|Sakshi

ఇందూరు, న్యూస్‌లైన్ : ఎప్పుడెప్పుడు కుర్చీలో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న కొత్త సర్పంచ్‌ల కల నెరవేరింది. శుక్రవారం పంచాయతీల పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాయి. దీంతో పంచాయతీలకు పండుగ కళ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలలోగా పంచాయతీ పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయాలని డీపీఓ సురేశ్‌బాబు సూచించిన విషయం తెలిసిందే.

చాలాచోట్ల ఉదయం 10 గంటల కే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గాల బాధ్యతలు, విధులు, అధికారాలను అధికారులు వివరించారు. పాలకవర్గాలు కొలువుదీరడంతో గ్రామాల్లో సుమారు రెండేళ్ల పాటు సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు శుక్రవారంతో తెరపడింది. దీంతో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు