చొక్కాల తయారీలో నూతన పరిజ్ఞానం

6 Nov, 2017 09:32 IST|Sakshi
కియోస్క్‌ పనితీరును వివరిస్తున్న హుబర్ట్‌ ఓజ్‌ డైరెక్టర్లు నిఖేష్‌లోధా, హఫీజ్‌రేషమ్‌వాలా

హుబర్ట్‌ ఓజ్‌ నూతన ఆవిష్కరణ

మంగళగిరి (తాడేపల్లి రూరల్‌): హాయ్‌లాండ్‌లో ఆదివారం 25వ ఫ్యాబ్రిక్‌ డిస్‌ప్లే సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఇందులో చొక్కాల రూపకల్పన, తయారీలలో హూబర్ట్‌ఓజ్‌ సంస్థ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన విధానాన్ని కనుగొన్నట్లు హుబర్ట్‌ ఓజ్‌ డైరెక్టర్లు నిఖేష్‌లోధా, హఫీజ్‌రేషమ్‌వాలా తెలిపారు. ఫ్యాబ్రిక్‌ డిస్‌ప్లే సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మనోజ్‌గిల్వానీ, డి.వి.సత్యనారాయణ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారు. తొలి కియోస్క్‌ను విజయవాడకు చెందిన గోపాల్‌ టెక్స్‌టైల్స్‌ అధినేత కె.వి.కె.కిషోర్‌ ప్రారంభించారు. తొండెపు మహేష్, మురళీ, సురేష్, 13 జిల్లాల టెక్స్‌టైల్స్‌ ఏజెంట్స్, వస్త్రవ్యాపారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు