అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు 

16 Nov, 2018 16:19 IST|Sakshi

హాయ్‌లాండ్‌ ఆస్తులు తమవి కావన్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం 

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసుపై ఉమ్మడి హైకోర్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తమది కాదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో కొత్త ట్విస్ట్‌ మొదలైంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం విచారించింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణ నుంచి ఆస్తుల వేలం వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీపై స్పెషల్‌ సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు