ఆఫర్లే ఆఫర్లు

31 Dec, 2018 10:41 IST|Sakshi

హోటళ్లు, స్వీట్‌ దుకాణాల ప్రకటనల హోరు

ఫ్లెక్సీలతో నిండిన కూడళ్లు 

హోరెత్తుతున్న ప్రచారం 

కడప కల్చరల్‌ : ఆఫర్లే ఆఫర్లు.. కొత్త సంవత్సరం వస్తూ వస్తూ ఆఫర్ల ఆనందాలను మోసుకొస్తోంది. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ డిసెంబరు 31న రాత్రంతా విందులు, వినోదాలతో ఆనదించేందుకు ఆసక్తి గల వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం హోటళ్లు, స్వీట్‌ స్టాళ్లు బోలెడు ఆఫర్లు ప్రకటించాయి. ఇలాంటి ప్రకటనలతో కూడిన ఫ్లెక్సీ హోర్డింగ్‌లను నగర కూడళ్లలో ఏర్పాటు చేశారు. రెండు బిర్యానీలకు ఒక బిర్యానీ ఫ్రీ.. కేజీ స్వీట్‌ కొంటే అర కిలో మిక్చర్‌ ఉచితం.. బిర్యానీ కొంటే కూల్‌డ్రింక్‌ ఉచితం.. ఇలా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ జిల్లాలోని హోటళ్లు, స్వీట్‌స్టాళ్లు, బేకరీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఆఫర్లు గుప్పిస్తున్నాయి.

 వీటితో కూడిన ప్రచారాన్ని బ్యానర్లు, ఫ్లెక్సీ హోర్డింగ్‌లతో కూడళ్లను నింపేశారు. ఎటు చూసినా ఆ బోర్డులే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రచారంలో పోటీపడుతున్నారు. దుకాణాల వద్ద కొత్త కళ కనిపించేలా రంగురంగుల విద్యుత్‌ దీపాల సీరియల్‌ సెట్లను అలంకరించారు. తమ దుకాణాలు మిగతా వాటి కంటే ఆకర్షణీయంగా కనిపించేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. కడప నగరంలోని ఏడురోడ్ల కూడలి, ఎన్టీఆర్, కోటిరెడ్డి సర్కిళ్లు, కృష్ణా సర్కిల్, ఎర్రముక్కపల్లె, అప్సర, పాతబస్టాండు సర్కిళ్లు ఇలా నగరంలోని ప్రముఖ కూడళ్లలన్నింటినీ భారీ ఫ్లెక్సీ, హోర్డింగ్‌లతో నింపేశారు. వాటిపై తాము ఆఫర్‌ చేస్తున్న వివరాలు పొందుపరిచారు.

ఆఫర్లు: బిర్యానీ ధర 25 శాతానికి తగ్గించారు. ఫ్యామిలీ ప్యాక్‌ బిర్యానీ తీసుకుంటే కూల్‌డ్రింక్‌ ఉచితంగా ఇస్తున్నారు. ఐదుగురు తినగలిగే బక్కెట్‌ బిర్యానీ ధరలో దాదాపు రూ. 150 వరకు తగ్గింపు ఇవ్వడంతోపాటు రెండు బట్టర్‌ నాన్, ఒక చికెన్‌కర్రీ, కూల్‌డ్రింక్‌ కూడా ఉచితంగా ఇస్తున్నారు. పార్శిల్‌ సౌకర్యం కూడా ఉందని ప్రకటించారు. నాన్‌ వెజ్‌ ఐటమ్‌లపై కూడా 25–40 శాతం తగ్గింపు ఇస్తున్నారు. మరికొన్ని హోటళ్లలో డిసెంబరు 31, జనవరి 1 సందర్భంగా బిర్యానీమేళా నిర్వహిస్తున్నారు. మరికొన్ని హోటళ్లలో ముందే టేబుళ్లు బుక్‌ చేసుకుంటే 30–50 శాతం బిల్లులో తగ్గిస్తున్నారు.

 ప్రముఖ స్వీట్‌ దుకాణాలలో కిలో స్వీట్‌ కొంటే అరకిలో మిక్చర్, అరకిలో స్వీట్‌ కొంటే పావుకిలో మిక్చర్‌ ఇలా ఆఫర్లు పెట్టారు. ఇంకొన్ని హోటళ్లలో రెండు బిర్యానీలకు ఒక బిర్యానీ ఫ్రీ, బిర్యానీలకు కూల్‌డ్రింక్‌ ఫ్రీ అంటూ భారీగా ఆఫర్లు గుప్పించారు. ప్రధాన కూడళ్ల చుట్టూ ఈ ఫ్లెక్సీ హోర్డింగ్‌లే ఉండడంతో అటు వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. కడప నగరంలో ఇలాంటి ఫ్లెక్సీలు కుప్పతెప్పలుగా వెలిశాయి. ‘నయాసాల్‌’పై ప్రజల్లో ఉన్న ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు తమదైన శైలిలో ఈ ఆఫర్లను ప్రకటించడం విశేషం.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

చంద్రబాబు అహంకారానికిది నిదర్శనం: మంత్రి

జసిత్‌ కిడ్నాప్‌ కేసును ఛేదిస్తాం: ఎస్పీ

‘వైఎస్‌ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’

ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

జమ్మలమడుగులో బాంబుల కలకలం

వినతుల పరిష్కారంలో పురోగతి : సీఎం జగన్‌

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ప్రజా సే‘నాని’.. సంక్షేమ వారధి..

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

భారమని‘పించనే లేదు’

ఇప్పటికింకా నా వయసు..

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

కాంట్రాక్టర్‌ మాయాజాలం

మహిళ మొక్కవోని దీక్ష

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

పేరేమో చేపది... సాగేమో రొయ్యది

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

సం‘సారా’లు బుగ్గి..

న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

కార్పొరేషన్‌ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

రండి.. కూర్చోండి.. మేమున్నాం

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!