నవ వధువు అదృశ్యం

9 May, 2018 14:17 IST|Sakshi

పీఎం పాలెం(భీమిలి): సుమారు 20 రోజల కిందట వివాహమైన నవ వధువు అదృశ్యంపై పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం సా యంత్రం కేసు నమోదయింది. ఇందుకు సం బంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... బోరవానిపాలెంకు చెందిన గొట్టాపు పావని (24)కి ఈ ఏడాది ఏప్రిల్‌ 18న విజయనగరం జిల్లా బాడంగికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. బీఎస్సీ వరకూ చదుకున్న ఆమె వివాహానికి ముందు స్థానికంగా ఓ ప్రైవేటు స్కూలులో టీచరుగా పని చేసేది. మంగళవారం ఉదయం 11 గంటలకు తాను పని చేసిన స్కూలుకు సోదరుడి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఆమెను అక్కడ దించేశాక సోదరుడు వెళ్లిపోయాడు. అనంతరం సాయంత్రం వరకూ పావని ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. స్నేహితురాళ్లను వాకబు చేశారు. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి శివున్నాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు