భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు

26 Jan, 2020 12:38 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూకంప ప్రకంపనలకు చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద 7 కిలోమీటర్ల లోతులో భూకంప నాబి కేంద్రంగా గుర్తించినట్లు ఎన్జీఆర్‌ఐ చీఫ్‌ సైటింస్ట్‌ నగేశ్‌ వెల్లడించారు. కాగా తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేలుపై 4.6గా నమోదైనట్లు భూకంప కేంద్రం నిపుణులు తెలపారు. ఇక్కడి నుంచి వచ్చిన తరంగాలతోనే ఏపీలోని గుంటూరు, కృష్ణా, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భూకంపం సంభవించిందని నగేశ్‌ పేర్కొన్నారు.

కాగా రెండున్నర వారాలుగా ఈ ప్రాంతంలో భూమిలోపల భూకంపాలు సంభవిస్తున్నాయని , పగుళ్ల కారణంగానే భూమి కంపిస్తుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సంభవించిన భూకంపాన్ని స్పెసిఫిక్‌ జోన్‌-2గా గుర్తించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో 1969లో రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా నమోదైందని, దాని తర్వాత మళ్లీ భూకంపం రావడం ఇదేనన్నారు. అయితే కట్టడాలు బలంగా ఉండడంతోనే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ సైంటిస్ట్‌ నగేష్‌ పేర్కొన్నారు. (కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూప్రకంపనలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు