కొనసాగుతున్న శ్రీనివాస్‌ విచారణ

15 Jan, 2019 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తమ కార్యాలయంలో నాలుగో రోజు విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు పలువురిని ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలు ముందుంచి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు చెప్పే విషయాలను రికార్డ్‌ చేస్తున్నారు. ఎన్‌ఐఏ డీఐజీ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు నిందితుడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉండనున్నాడు.

ఎన్‌ఐఏ అధికారులతో కూడిన మరో బృందం విశాఖపట్నంలో విచారణ జరుపుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగుందని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్‌ను మరోసారి విశాఖపట్నం తీసుకెళ్లే అవకాశం లేదని, మిగతా మూడు రోజులు హైదరాబాద్‌లోనే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. (వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?)

మరిన్ని వార్తలు