ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని అధిరోహించిన నిడదవోలు యువకుడు

12 Sep, 2019 12:15 IST|Sakshi
ఎల్‌బ్రూస్‌ పర్వతంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శిస్తున్న  లక్ష్మణ్‌ 

సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు) :  రష్యాలోని అతిపెద్ద ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని నిడదవోలుకు చెందిన పర్వతారోహకుడు కంచడపు లక్ష్మణ్‌ బుధవారం అధిరోహించాడు. రష్యాలో ఈనెల 6న  5,642 మీటర్లు ఎత్తు ఉన్న ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించగా బుధవారం నాటికి  అధిరోహించి అరుదైన ఘనతను సాధించాడు. 2018 సెప్టెంబర్‌లో ఆఫ్రికా ఖండంలోనే 5,886 మీటర్లు ఉన్న అతి పెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన లక్ష్మణ్‌ ఇప్పుడు ఎల్‌బ్రూస్‌ పర్వతం అధిరోహించి.. అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటాన్ని ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి లక్ష్మణ్‌కు వైఎస్సార్‌ కుటుంబం అంటే ఎనలేని అభిమానం.  వైసీపీ నాయకులు,  స్వచ్ఛంద సంస్థలు పర్వతారోహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.లక్ష, నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు రోటరీక్లబ్‌ అధ్యక్షుడు అయినీడి పల్లారావు రూ. 50 వేల సాయం అందించారు. మాజీ  రోటరీక్లబ్‌ అధ్యక్షులు కారింకి సాయిబాబు రూ.10 వేలు అందించారు. 

మరిన్ని వార్తలు