హైకోర్టు అదనపు జడ్జీలుగా 9 మంది ప్రమాణం

24 Oct, 2013 01:58 IST|Sakshi
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా తొమ్మిది వుంది బుధవారం ప్రవూణ స్వీకారం చేశారు. జస్టిస్ బులుసు శివశంకర్, మంథాట సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాద రావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిశోర్ జైశ్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్‌ల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం పదిన్నరకు జరిగిన ప్రవూణ స్వీకార  కార్యక్రవూనికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులతో పాటు కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యూరు. అనంతరం జస్టిస్ రోహిణితో కలసి జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ అశుతోష్ మొహంతాతో కలసి జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డితో కలసి జస్టిస్ జైశ్వాల్, జస్టిస్ సుభాష్‌రెడ్డితో కలసి జస్టిస్ శంకరనారాయణ, జస్టిస్ కేసీ భానుతో కలిసి జస్టిస్ అనీస్ కేసుల విచారణలో పాలుపంచుకున్నారు. మిగిలిన నలుగురు న్యాయువుూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులను విచారించారు.
 
మరిన్ని వార్తలు