అనంతపురం: బయటపడ్డ టీడీపీ నేతల కుట్ర

17 Dec, 2019 18:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు పెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తల కుట్ర బయటపడింది. వివరాలు.. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో రైతు నారాయణ రెడ్డి పాతిన బండలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నెపాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నెట్టి వారిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నారు. సమాచారమందుకొని బండలను ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన పోలీసులపై వారు దాడికి దిగారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో టీడీపీ నేత నాగరాజు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు