నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం: ఎన్‌ఐటీ డైరెక్టర్‌

17 Feb, 2020 14:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు  తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తాడేపల్లిగూడెం నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సి. సూర్య ప్రకాష్‌ రావు స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్‌ వీడియో ఆధారంగా పీహెచ్‌డీ పట్టాలకు అయిదు లక్షలు డిమాండ్‌ చేసినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆదివారం పైడికొండల మాణిక్యాల రావు ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో విలేకరుల సమావేశంలో ఈ విషయంపై సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ..తమ వాళ్లకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదనే దురుద్ధేశంతోని తనను ఉద్యోగం నుంచి తప్పించడానికి బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

ఓ వీడియోను పూర్తిగా ట్యాపింగ్‌ చేసి, మాటలను ఎడిట్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టారని విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలను, ఎడిట్‌ చేసిన వీడియోలను నమ్మి మాజీ మంత్రి పైడి కొండల ఇలా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మీమీద విమర్శలు వస్తున్నాయని తనను పిలిచి అడిగి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే పదవి నుంచి వైదులుగుతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌డీకి లేఖ రాశానని తెలిపారు. స్టేట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఈ వీడియో పంపిస్తున్నట్లు, దీనిపై సైబర్‌ కక్రైం కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు

మరిన్ని వార్తలు