కుర్చీలు ఖాళీలేక బయటే ఉండిపోయి అశోక్ బాబు

14 Dec, 2013 19:01 IST|Sakshi
కుర్చీలు ఖాళీలేక బయటే ఉండిపోయిన అశోక్ బాబు

హైదరాబాద్: ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచి తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేయలేకపోయింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి, ఉత్తమకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఐఆర్,  హెల్త్ కార్డులపై చర్చించవలసి ఉంది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా హజరయ్యారు. అయితే లోపల కుర్చీలు ఖాళీ లేక ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు బయటే ఉండిపోయారు.

బయట ఉన్న అశోక్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ వైఫల్యం అన్నారు. చర్చలకు ఆహ్వానించినప్పుడు తగిన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. ఆహ్వానించినవారిని మాత్రమే లోపలకు అనుమతించాలన్నారు. ఎవరుబడితే వారు వచ్చి కూర్చుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు