పతివాడ, కోళ్లకు.. నిరాశే

9 Jun, 2014 01:38 IST|Sakshi
పతివాడ, కోళ్లకు.. నిరాశే

 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడికి ప్రస్తుతానికి నిరాశే మిగిలింది. ఆయనకు మంత్రి పదవి ఖాయమని టీడీపీ వర్గాలు తొలి నుంచి చెప్పుకొచ్చినా చివరి నిమిషాన సమీకరణాల నేపథ్యంలో పతివాడను అధినేత పక్కన పెట్టేశా రు. అదే తరహాలో కోళ్ల లలితకుమారికి కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి ఎమ్మె ల్యేగా ఎన్నికైనా, కోళ్ల అప్పలనాయుడు వారసురాలిగా మంత్రి పదవి దక్కుతుంద ని టీడీపీ శ్రేణులు భావించినా చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. సీనియారిటీని, విధేయత ను పక్కన పెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి మృణాళినికి పెద్ద పీట వేశారు.  మంత్రి వర్గ కూర్పులో జిల్లా ఎమ్మెల్యే ల లాబీ యింగ్ పనిచేయలేదు.
 
 పక్క జిల్లా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తనకున్న శక్తియుక్తులన్నీ ప్రదర్శించి తన మరదలు కిమిడి మృణాళినికి మంత్రి పదవి దక్కేలా పావులు కదిపారు. వాస్తవానికైతే, ఈసారి  పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలిద్దరికీదక్కుతుందని జిల్లా వాసులు భావించారు. ఆ మేరకు పార్టీ నుంచి వారికి తొలుత సంకేతాలొచ్చాయి. రెండు రోజుల ముందు వారిద్దరు పేర్లు ప్రతిపాదిత దశలో కన్పించాయి. దాదాపు ముందురోజు వరకు అవే పేర్లు తెరపై ఉన్నాయి. దీంతో అటు పతివాడ అనుచరులు, ఇటు కోళ్ల లలితకుమారి అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని గుంటూరు వెళ్లారు. చంద్రబాబుతో పాటు తమ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించారు.
 
 కానీ, గుంటూరు వెళ్లేసరికి వారికి దిమ్మ తిరిగే విషయం తెలిసింది. తమ నేతలకు కాకుండా కొత్తగా ఎన్నికైన కిమిడి మృణాళినికి క్యాబినెట్‌లో బెర్త్ దక్కిందని తెలియగానే తీవ్ర నిరాశకు గురయ్యారు. కోళ్ల వర్గానికి అదే పరిస్థితి ఎదురైంది. అటు వెలమ, ఇటు మహిళ, మధ్యలో తన తాత వారసత్వం దృష్ట్యా మంత్రి పదవి దక్కుతుం దని ఆశించినా చంద్రబా బు అవేవీ పట్టించుకలేదు. ప్రస్తుతానికైతే ఆమెను పరిగణనలోకి తీసుకోలే దు. ఇక వారిద్దరి ఆశలు మంత్రి వర్గ విస్తరణపైనే.
 

మరిన్ని వార్తలు