బాబు మారలేదు

18 Jun, 2014 03:01 IST|Sakshi
బాబు మారలేదు

కార్యకర్తలు, నేతల అసంతృప్తి, ఆగ్రహం
ఆయన్ను కలవాలంటే పోలీసులు అడ్డుకుంటారా ?
కుప్పం సర్పంచ్ ఆధ్వర్యంలో ధర్నా
వరస్ట్ అంటూ తమ్ముళ్లపై చంద్రబాబు మండిపాటు
మెజారిటీ ఎందుకు తగ్గిందని చిర్రుబుర్రులు
మీరు పనిచేయకున్నా నన్ను చూసి ఓట్లేశారని వ్యాఖ్య
 


సొంత నియోజకవర్గం కుప్పం లో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రెండు రోజుల సుడిగాలి పర్యటన కార్యకర్తలు, స్థానిక నేతలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పదే ళ్ల తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ తమ నేత లో ఎలాంటి మార్పు లేదని వారు ఆందోళన చెందుతున్నారు. అండగా ఉంటానన్న నాయకుడే అధికారుల ముందు తిట్ల పర్వం ఎత్తుకోవడంతో నిర్ఘాంతపోయారు. ఈ విధంగా వ్యవహరిస్తే అధికారులు తమకు విలువెందుకు ఇస్తారం టూ వాపోతున్నారు. సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించా రు. నిర్ణీత సమయానికి నాలుగు గంట లు ఆలస్యంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన బాబు పర్యటన ఆ రోజు రాత్రి 2.30 గంటలకు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంతో ముగించారు. మంగళవారం ఉద యం తొమ్మిది గంటల నుంచి ప్రజలను కలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. రెండు గంటలపాటు ప్రజలను కలుసుకున్న ఆయన 11 గంటలకు బయలుదేరి వెళ్లారు.

మెజారిటీ తగ్గినందుకు మీరే కారణమంటూ నేతలపై అసంతృప్తి

కుప్పం నియోజకవర్గాన్ని తాను ఎంత అభివృద్ధి చేసినా కార్యకర్తలు, నాయకులు ప్రజలకు సరిగా వివరించలేకపోయారంటూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 వేల మెజారిటీ ఆశిస్తే 47 వేలకు పరిమితం కావడం ఏంటని సోమవారం రాత్రి జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయ న కుప్పం నేతలను ప్రశ్నించారు. పోలింగ్ రోజున కుల సమీకరణలు పనిచేశాయని, నాయకులు కష్టపడి పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని నెపం వారిపై నెట్టేశారు. అంతేకాకుండా ప్రజలు అభిమానంతో తనను చూసి ఆ ఓట్లైనా వేశారంటూ వ్యాఖ్యానించారు. మీరు పనిచేసినా చేయకున్నా నాకు ఓటర్లు ఉన్నారంటూ చురకలు అంటించారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు సమన్వయకమిటీ సమావేశానికి హాజరైన నాయకులు మౌనం వహించారు. కాగా మంగళవారం ఉదయం చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహంలోకి స్థాని క సర్పంచ్ వెంకటేష్ సహా స్థానిక నేతలను పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు అతిథిగృహం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు బయటకు వచ్చారు. ధర్నా చేస్తున్న నేతలు, కార్యకర్తలను ఉద్ధేశించి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ‘ఏయ్, నోర్మూసుకో ..మీరు ఓవర్ చేస్తున్నారు. చదువుకున్నారా? లేదా? వ రస్ట్‌గా తయారయ్యారు. మీ లాంటి వాళ్లు నాకు అవసరం లేదు. నేనొక మార్గంలో వెళ్తుంటే, మీరొక మార్గంలో వెళ్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన కార్యకర్తలు ధర్నా విరమించి అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగానే ధర్నా చేయాల్సిన పరిస్థితి కలిగినా కార్యకర్తలను నిందించడం జీర్ణించుకోలేకపోయారు.

అధికారుల పడిగాపులు

 ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి కుప్పం రావడంతో జిల్లా అధికార యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. జిల్లా అధికారులతో సమావేశం కూడా ఉండటంతో బాబు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు జరగాల్సిన అధికారుల సమీక్ష సమావేశం రాత్రి 10.30 గంటలకు ప్రారంభించారు. దీంతో అధికారులు అప్పటివరకు ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది.

కడా పునురుద్ధరణ విషయం పరిశీలిస్తానని హామీ

 కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కడా)ని పునరుద్ధరించే విషయం పరిశీలిస్తానని చంద్రబాబు ప్రకటించారు. గతంలో తాను కడా ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని, ఇప్పటికిప్పుడు దాన్ని పునరుద్ధరించే అవకాశాలు లేనప్పటికీ పరిశీలించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు