సౌకర్యాలు అధ్వానం

30 Nov, 2013 06:25 IST|Sakshi

బాసర, న్యూస్‌లైన్ :  బాసర ట్రీపుల్‌ఐటీలో సౌకర్యాల తీరుపై ఆర్డీవో అరుణశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్డీవో ట్రీపుల్‌ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమా రు రెండు గంటలపాటు ఉండి, ప్రతీ విభాగాన్ని పరిశీ లించారు. మెస్, వైద్యశాల, వంట గదులతోపాటు హాజ రుపట్టికలను తనిఖీ చేశారు. వంటశాలలో కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చారుు. కారంపొడి, పప్పులు తది తర సరుకులు నాసిరకం వాడుతుండడంతో మెస్ నిర్వాహకుడిపై మండిపడ్డారు. విద్యార్థులకు కనిపిం చేలా మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం వైద్య శాలను తనిఖీ చేశారు.

వైద్యశాలలో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులుండగా ఒక్కరే విధులకు హాజరయ్యూరు. దీంతో హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుపట్టికలో ముందే సంతకాలు చేసి ఉండడం, ఒకరి సంతకాలు మరొకరు పెట్టడంపై వైద్యు డు కౌశిక్‌పై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో కనీసం ఫ్రీజ్ సైతం లేకపోవడమేంటని, మందులు ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ నిర్వహణ తీరుపై ఓఎస్‌డీ నారాయణతో మాట్లాడారు.  
 నిర్వహణ అస్తవ్యస్తం..
 ట్రిపుల్ ఐటీ తనిఖీ అనంతరం ఆర్డీవో అరుణశ్రీ విలేకరులతో మాట్లాడారు. సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులున్న ట్రీపుల్ ఐటీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉం దని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తు న్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పన, పరిపాలన విషయంలో ట్రీపుల్‌ఐటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మెస్‌లో కుళ్లిన కూరగాయల నిల్వలు ఉన్నాయన్నారు.

నిధుల విషయంలో ఆడిట్ లేకపోవడంతో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలపై అధికారులు బదులు ఇవ్వలేకపోయూరని తెలిపారు. ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉందని, ఇందులో ఇద్దరు ఉండగా తనిఖీ సమయంలో ఒక్కరే ఉన్నారని చెప్పారు. తనిఖీలో వెలుగుచూసిన విషయూలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందిస్తానని పేర్కొన్నారు. ఆమె వెంట తహశీల్దార్ నరేందర్, ఆర్‌ఐ, వీఆర్‌ఏ ఉన్నారు.

మరిన్ని వార్తలు