అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు

10 Sep, 2014 10:38 IST|Sakshi
అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు

గుంటూరు : రైతు రుణమాఫీ చేసి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అన్న క్యాంటిన్లు ప్రారంభం కానున్నట్లు పరిటాల సునీత వెల్లడించారు.

మంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె నియోజకవర్గం బేతపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు

>
మరిన్ని వార్తలు