హారన్లు.. హాహాకారాలు∙

19 Apr, 2018 11:04 IST|Sakshi

బైకుల నుంచి వింత శబ్దాలు

బెంబేలెత్తున్న నగర ప్రజలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముందెళ్లేవారు వెనుకొచ్చే వారికి దారివ్వాలనే సంకేతానికి, వెనుకగా తాము వస్తున్నామనే విషయం తెలిపేందుకు మాత్రమే హారన్లు విని యోగించే కాలం చెల్లిపోయింది. ప్రజ లందరూ తమకు ఆకర్షితులు కావడానికి, తమ గురించే చర్చింకోవడానికి అ న్నట్టుగా ఆయా హారన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇవే ఫ్యాషన్‌గా మారి ంది. వాటి నుంచి వచ్చే వింతవింత శ బ్ధాలతో నగర ప్రజలను బెంబేలెత్తిపోతున్నారు. శారీరక, మానసిక అనారో గ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

శబ్ద కాలుష్యమే పరమావధి

శబ్ద కాలుష్యం సృష్టించడమే పరమావధిగా కొందరు యువకులు తమ బైకులకు అమర్చుకునే హారన్ల ద్వారా ఇతరులకు దడ పుట్టిస్తున్నారు. యువత రోడ్లపై ఇష్టానుసారం తిరుగుతూ వేస్తున్న హారన్ల శబ్దాలు ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఉపధ్రవమేదో జరుగుతోందనే ఆందోళనలో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు.

ఇటీవల బుల్లెట్‌ బైక్‌ల వినియోగం పెరగడంతో వాటి నుంచి సాధారణంగానే పెద్దశబ్ధం వస్తుండగా, వాటికి అమర్చే హారన్లు నుంచి వచ్చే పెద్దశబ్దం ధ్వని కాలుష్యాన్ని పెంచిపోషిస్తున్నాయి. చిన్నారులు బిగ్గరగా ఏడుస్తున్నట్లు, ఏదో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు హాహాకారాలు చేస్తున్నట్లు, హర్రర్‌ సినిమాల్లోని భయంకర శబ్దాలు హారన్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కొందరైతే మంత్రులు, కలెక్టర్లు, ఇతర వీఐపీలు బుగ్గకార్లకు వాడే హారన్లు, ఫైర్‌ ఇంజన్, అంబులెన్స్‌ హారన్లను కూడా బైకులకు వినియోగిస్తున్నారు. 

నిబంధనలివి

కేంద్ర మోటార్‌ వాహనాల చట్టంలో వాహనాల హారన్ల శబ్దం ఎన్ని డెసిబుల్స్‌ ఉండాలో నిర్దేశించారు. ఇవి ట్రాఫిక్‌ విధులు నిర్వహించే కొందరికి తెలియకపోవడం శోచనీయం. మోటార్‌ బైకులకు 80 డెసిబుల్స్, కార్లకు 82, ప్యాసింజర్‌ లేదా నాలుగు టన్నుల లోపు తేలికపాటి వాహనాలకు 85, 12 టన్నుల సామర్థ్యం గల వాహనాలకు 88, అంతకు మించిన భారీ వాహనాలకు 91 డెసిబుల్స్‌ హారన్‌ మాత్రమే వినియోగించాలి.

అనారోగ్యమే

శబ్ద కాలుష్యం అధికమైతే తాత్కాలిక, శాశ్వత వినికిడి లోపం ఏర్పడే ప్రమాదముంది. మోతాదుకు మించిన శబ్దం మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. చెవుల్లో దూది పెట్టుకుంటే 5 డెసిబుల్స్‌ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఇయర్‌ ప్లగ్స్‌ వినియోగంతో 15 డెసిబుల్స్, ఇయర్‌ మగ్గస్‌తో 30 నుంచి 40 డెసిబుల్స్‌ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. 

– డాక్టర్‌ దొంతంశెట్టి బసవరాజు, చెవి, ముక్కు,గొంతు వైద్య నిపుణులు

మల్టీ టైప్‌ హారను నిషేధం

మోటారు వాహనాల చట్టం మల్టీ టైప్‌ హారన్లను నిషేధించింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, బాలికల హాస్టళ్లు వంటి ప్రాంతాల్లో హారన్లను వినియోగించరాదు. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే 108 జీఓ ప్రకారం రూ.1000 అపరాధ రుసుంగా వసూలు చేస్తాం. – కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 

మరిన్ని వార్తలు