ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదు.. రీ షెడ్యూలే

12 Jul, 2014 23:22 IST|Sakshi

హైదరాబాద్: రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మెలిక పెట్టారు. ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదని, రీ షెడ్యూల్ మాత్రమే చేస్తామని చంద్రబాబు చెప్పారు.

శనివారం విజయవాడకు వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2014 ఏప్రిల్ నాటికి ఉన్న రుణాల్లో ఓ కుటుంబానికి ఓ లోన్ మాత్రమే మాఫీ చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు