'ఇక ఉద్యోగాల భర్తీలేదు'

17 Apr, 2015 10:58 IST|Sakshi
'ఇక ఉద్యోగాల భర్తీలేదు'

చిత్తూరు : రానున్న కాలంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉండబోదని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీతభత్యాలకే సరిపోతుందని తెలిపారు. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీ కష్టంగా మారిందని, వారికి జీతాలు ఇవ్వలేమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నఅదనపు ఉద్యోగులను గుర్తించేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలా గుర్తించిన ఉద్యోగులను ప్రాధాన్యత ఉన్న శాఖల్లో నియమిస్తామని బొజ్జల చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు త్వరలోనే ఒక నూతన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తేనున్నట్లు మంత్రి తెలిపారు.
(బి.కొత్తకోట)

మరిన్ని వార్తలు