'అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు'

25 Nov, 2013 15:40 IST|Sakshi
'అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు'

హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రోరోగ్ ఫైల్ తన కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కాగా, తాను ఆ ఫైల్ను ఇంతవరకూ చూడలేదన్నారు. ప్రోరోగ్ అంశంపై శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీని ప్రోరోగ్ పరచాల్సిన అవసరం లేదన్నారు.

 

అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్ లు ఏమీ లేవన్నారు. వచ్చే నెల 20 లోగా అసెంబ్లీ ఖచ్చితంగా భేటీ అవుతుందని తెలిపారు. రాయల తెలంగాణ కోసం తనకెలాంటి ఫోన్ కాల్స్ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్నిఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే అసెంబ్లీని ప్రోరోగ్ పరచాలంటూ సీఎం కార్యాలయం స్పీకర్ కు ఓ లేఖ పంపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు