అమ్మలకు పస్తులు

25 Feb, 2014 01:45 IST|Sakshi
అమ్మలకు పస్తులు

 ఉధృతమైన అంగన్‌వాడీల సమ్మెనిలిచిపోయిన ‘అమృత హస్తం’
 కేంద్రాలకు తాళాలు వేసిన కార్యకర్తలు
 ప్రత్యామ్నాయ మార్గాలు చూడని అధికార యంత్రాంగం
 గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టిక భోజనం
 శిశువుల చెంతకూ చేరని ఆహారం
 
 సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు సమ్మెబాట పట్టడంతో బాలింతలు, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత హస్తం పథకం సమ్మె కారణంగా నిలిచిపోయింది.
 
 మోర్తాడ్, న్యూస్‌లైన్:
 జిల్లావ్యాప్తంగా అమృత హస్తం పథకం కిం ద లబ్ధి పొందుతున్నవారికి పౌష్టికాహారం అంద డం లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు సమ్మె నోటీసును ముందుగానే ఇచ్చారు. ఈ క్ర మంలో అమృత హస్తం పథకం అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్లు ఉండటంతో అమృత హస్తం పథకం నిలిచిపోయింది. భీమ్‌గల్, మద్నూర్, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 19 మండలా లలో ఉన్న 2,628 అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ పథకం అమలవుతోంది. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 11,694 మంది గర్భిణులు, 7,650 బాలింతలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకున్నారు.
 
 సంఖ్య పెరిగినా
 గర్భం దాల్చిన ప్రతి మహిళకు పౌష్టిక ఆహారం అందించాలి. వారు ప్రసవించిన తరువాత ఆరు నెలల వరకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి. ప్రస్తుతం గర్భిణులు, బాలింతల సంఖ్య పెరిగింది. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, కూరలతోపాటు కోడి గుడ్డు, పాలను అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాలలోనే వంట చేసి అమృత హస్తం భోజనాన్ని అందించాల్సి ఉంది. కొన్ని రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి లోటు కలిగించలేదు.
 
 చిన్నారుల పరిస్థితీ అంతే
 ఇపుడు పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావడంతో పథకానికి ఆటంకం కలుగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టిక ఆహా రం అందని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా నియమితులైన లింకు వర్కర్‌లతో అమృతహస్తం పథకాన్ని కొనసాగించాలని అధికారులు భావించా రు. అయితే సామగ్రి ఉంచే గదులకు తాళాలు వేసిన కార్యకర్తలు తాళం చేతులు ఎవరికి ఇవ్వలేదు. అధికారులు సమ్మెకు ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగ న్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించి అమృత హస్తం పథకాన్ని పునప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
 
 రోజూ కేంద్రానికి వచ్చి వెళ్తూ
 బిచ్కుంద : పది రోజుల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. నిరుపేద గర్భిణులు రోజూ పౌష్టికాహారం కోసం కేంద్రానికి వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. పుట్టబోయే పిల్లలు శారీ రకంగా ధృడంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన అమృత హస్తం పథకం వారికి అందకుండా పోతోంది. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు 125 గ్రాముల బియ్యంతో వండిన అన్నం, వివిధ రకాల కూరగాయలు, రోజుకో గుడ్డు, 200 గ్రాముల పాలు ఇవ్వాలి. గత పది రోజుల నుంచి ఆహారం అందక పోవడంతో గర్భిణులు, బాలింతలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో లేదోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామాతో అంగన్‌వాడీ సమస్యలను పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు.

మరిన్ని వార్తలు