ఒక్క పక్కా ఇల్లు కూడా లేదు

27 Jul, 2016 00:49 IST|Sakshi
ఒక్క పక్కా ఇల్లు కూడా లేదు
సీతారామపురం: ఇంతవరకు ఒక పక్కాఇల్లు కూడా మంజూరు చేయలేదని సింగారెడ్డిపల్లి బీసీ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే మేకపాటì చంద్రశేఖర్‌రెడ్డి వద్ద వాపోయారు. మంగళవారం మండలంలోని సింగారెడ్డిపల్లి, ఎస్సీ,  బీసీకాలనీలు,  నాంచారంపల్లి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సింగారెడ్డిపల్లి గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన 100 వాగ్దానాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా బ్యాలెట్‌లోని విషయాలను స్థానికులకు వివరించారు. 
వర్షం వస్తే ఉరుస్తున్నాయి 
30ఏళ్ళ క్రితం ఇళ్లు నిర్మించుకున్నామని వర్షం వస్తే ఉరుస్తూ ఇంటిలో నీరు చేరుతున్నాయని సింగారెడ్డిపల్లివాసులు వాపోయారు. నాయకులకు, అధికారులకు సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనంలేదని పరిష్కారం చూపాలని మేకపాటిని కోరారు. ఈ సందర్భంగా మేకపాటి స్పందిస్తూ.. ఎంపీ రాజమోహన్‌రెడ్డి నిధుల్లో ఇంటికి రూ.10 వేలు అందజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరుగుదొడ్లు, ఉపాధి బిల్లులు రాలేదని కొందరు స్థానికులు విన్నవించగా.. సమస్యను పరిష్కరించాలని స్థానిక  సర్పంచ్‌కు మేకపాటి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 అబద్ధాలుఆడి, ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మాట ఇస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా కట్టుబడి ఉండాలని అన్నారు.  ఇంతలో ఓ వృద్ధుడు  స్పందిస్తూ ‘వాళ్ల నాన్న రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడైన అబద్ధాలు ఆడి ఉంటే కదయ్యా.. జగన్‌ నోటి నుంచి అబద్ధాలు వచ్చేది.. ఆ వారసత్వమే కదా.. చేయగలిగితేనే చెబుతాడు.’ అని అనడంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్నవాళ్లు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పాణెం రమణయ్య, గోరంట్ల తిరుపాలు, సర్పంచ్‌ డి.పెంచలమ్మ, ఉపసర్పంచ్‌ పాణెం సుధాకర్‌గౌడ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గాజుల పల్లి రామ్మోహన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, మాజీ ఎంపీపీ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు