బోటుకు చోటేదీ

27 Aug, 2014 03:45 IST|Sakshi

 పాతపోస్టాఫీసు: విశాఖ ఫిషింగ్ హార్బ ర్ సుమారు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉం ది. రూ.4.26 కోట్లతో 11 జెట్టీలను 1976లో విశాఖపట్నం పోర్టుట్రస్టు నిర్మించింది. 750 మరబోట్లు, 1500 మోటారుబోట్లు,100 మినీ ట్రాలర్లు, భారీ ట్రాలర్లను ఈ 11 జెట్టీల్లోనే కట్టాలి. కానీ పదేళ్ల క్రితం మరమ్మతులకు గురైన 14 ట్రాలర్లను యజమానులు పట్టించుకోకపోవడంతో అవి మునిగిపోయాయి. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని భావించి అలాగే వదిలేశారు. దీంతో ఇవి 300 మరబోట్లు పట్టే స్థలాన్ని ఆక్రమించాయి.

అప్పటి నుంచి జెట్టీల్లో అడుగు చోటు దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం ఒకబోటు వెనుక మరోబోటును ఇలా నాలుగు వరుసల్లో కట్టుకుంటున్నారు. బోట్లలో డీజిల్, ఐస్, నిత్యావసర వస్తువులు నింపుకునే ందుకు మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. ముందున్న బోట్లను తీస్తే గానీ వెనుకున్న బోట్లు ముందుకు వచ్చి నింపుకోవడం కుదరదు. లేదంటే ముందున్న బోట్లు వేటకెళ్లేంతవరకు ఎదురుచూడాల్సిందే. ఇక బోటు మరమ్మతుకు గురైందంటే.. ఇక అంతే సంగతులు.

 నీటిలో మునిగిన ట్రాలర్లు పైకి 10 శాతం మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 90 శాతం నీటి అడుగున ఉంటాయి. పదేళ్లుగా అవి నీళ్లలో ఉండడంతో బాగా తుప్పుపట్టి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరబోట్లకు చిన్న ఇనుపముక్క తగిలినా నష్టం భారీగా ఉంటుంది. పనుల కోసం మత్స్యకారులు నీళ్లలోకి దిగితే వీటి వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మునిగిన ట్రాలర్ల వల్ల చాలా కష్టాలు పడుతున్నామని, వాటిని తొలగించాలని చాలా కాలంగా పోర్టు అధికారులను మత్స్యకారులను కోరుతూనే ఉన్నారు.

 మునిగిన ట్రాలర్లను తొలగించాలి
 మునిగిన 14 ట్రాలర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హార్బర్‌లో 300 మరబోట్లు పట్టేంత స్థలాన్ని ఇవి ఆక్రమించాయి. మరబోట్లు పెట్టుకోవడానికి స్థలం కరువైంది. నాలుగు వరుసల్లో బోట్లను కట్టుకుంటున్నాం. ఒక మరబోటు తయారీకి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. మునిగి తుప్పుపట్టిన ట్రాలర్లు మరబోటుకు తగిలితే చాలా నష్టం కలుగుతుంది. నీటి అడుగు భాగా నికి వెళ్లినప్పుడు తుప్పు వ స్తువులు తగిలి మత్స్యకా రు లు  ప్రమాదాలకు గురవు తున్నారు. వీటిని వెంటనే తొల గించి మా కష్టాలు తొలగిం చాలి.       - బర్రి కొండబాబు, కోస్టల్ మరపడవల సంఘం అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు