కర్నూలులో నాకు పోటీ లేదు

16 Jan, 2014 12:25 IST|Sakshi
కర్నూలులో నాకు పోటీ లేదు

కర్నూలులో తనతో పోటీపడే నాయకులు లేరని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కర్నూలు నగరం బుధవారపేటలో రాయలసీమ హజ్హౌస్ నిర్మాణ పనులకు ఆయనతో పాటు మైనరాటీ సంక్షేమ శాఖ మంత్రి సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు.

 

అనంతరం టీజీ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ... హజ్హౌస్ నిర్మాణానికి ప్రతిపక్ష నాయకులతోపాటు కొందరు అధికార  పార్టీ నాయకులు కూడా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు ఆధారలతో సహా బయటపెడతానని చెప్పారు. తాను గతంలో టీడీపీలో ఉన్నా, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన ప్రజలు ఆదరించారని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు