ములాఖత్‌లను అడ్డుకోలేరు: న్యాయనిపుణులు

24 Aug, 2013 21:18 IST|Sakshi

హైదరాబాద్: ములాఖత్‌లను అడ్డుకునే అధికారం జైలు అధికారులకు లేదని మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.రామచంద్రరావు అన్నారు. ములాఖత్‌లనేవి విచారణలో ఉన్న వ్యక్తికి చట్టంద్వారా సంక్రమించిన హక్కులని, ఇది జైలు అధికారుల న్యాయపరిధిలో ఉండదని స్పష్టం చేశారు. నిరవధిక నిరాహారదీక్షకు, విచారణలో ఉన్న వ్యక్తి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని తెలిపారు. నిరవధిక నిరాహారదీక్ష అనేది వ్యక్తి ఇష్టమన్నారు.

నిరాహారదీక్ష వల్ల జైల్లో ఉన్న వ్యక్తి హక్కులు కోల్పోయే అవకాశం లేదని సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ అన్నారు. ములాఖత్‌లను ఎవరూ రద్దుచేయలేరని చెప్పారు. ములాఖత్‌లను రద్దుచేసే అధికారం జైలు అధికారులకు లేదన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆదివారం నుంచి జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఎల్ల్లో మీడియా అసత్య ప్రచారం మొదలు పెట్టింది.

మరిన్ని వార్తలు