‘పంచమి’ మంచిదని..!

11 Jul, 2013 17:16 IST|Sakshi
‘పంచమి’ మంచిదని..!
         
7/11/2013 6:06:00 AM
పంచాయతీ ఎన్నికల కోసం మంగళవారం నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలిరోజు అమావాస్య ఘడియలు, ఆషాఢం వెరసి నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వెనకడుగు వేశారు. చివరిరోజు ‘పంచమి’రోజునే నామినేషన్లు దాఖలు చేసే యోచనలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు.

సాక్షి, కడప: పంచాయతీ ఎన్నికల ఐదు రోజుల నామినేషన్ల ఘట్టంలో చివరిరోజే మంచిరోజనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు. అందరూ 13వ తేదీ పంచమి ఘడియల్లో నామినేన్లు దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అటు రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థుల గెలుపు ముఖ్యమనే ఉద్దేశంతో ఈ ఘడియలకు ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం కూడా తొలిరెండురోజులు నామినేషన్ల పర్వంలో హడావుడి లేకపోవడానికి కారణమని తెలుస్తోంది.

మొదటి రెండురోజులు స్పందన ఏదీ?
నామినేషన్ల తొలిరోజు 9వ తేదీ జిల్లాలో 53 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ స్థానాలకు 27, వార్డుసభ్యుల స్థానాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులోనూ కడప డివిజన్‌లో 12, రాజంపేట పరిధిలో 7, జమ్మలమడుగు డివిజన్‌లో 6 నామినేషన్లు దాఖలు చేశారు.

తొలిరోజు నామినేషన్లు మందగించేందుకు కారణం ఆషాఢ శుద్ధపాడ్యమి. దీంతో చాలామంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ముందుకు రాలేదు. పైగా 8వతేదీ అమావాస్య కావడంతో 9వతేదీ ఉదయం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. అమావాస్య ఘడియల్లో నామినేషన్లు దాఖలు చేయడం మంచిది కాదనే యోచనతో కొందరు వెనకడుగు వేశారు.

నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉన్న ఐదు రోజుల్లో పంచమి మినహా బుధవారం విదియ కూడా మంచిరోజనే కారణంతో రెండోరోజు నామినేషన్లు కాస్త ఎక్కువగానే దాఖలయ్యాయి. రెండో రోజు బుధవారం సర్పంచ్ స్థానాలకు 512, వార్డు స్థానాలకు 800 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్పంచ్ స్థానానికి 207, వార్డులకు 286. జమ్మలమడుగు పరిధిలో సర్పంచ్ స్థానాలకు 131, వార్డులకు 234, రాజంపేట డివిజన్‌లో సర్పంచ్ స్థానాలకు 174, వార్డులకు 280 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే గురువారం తదియ, శుక్రవారం చవితి...ఈ క్రమంలో శుభముహూర్తంగా భావించే పంచమి ఘడియల్లో నామినేషన్లు దాఖలు చేస్తే విజయం దక్కుతుందనే భావనతో చాలామంది చివరిరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

చివరిరోజుపై అధికారుల ముందస్తు సన్నాహాలు:
జిల్లాలో 785 పంచాయతీలు, 7724 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీటికి నామినేషన్ల దాఖలుకు ‘పంచమిరోజు’ శనివారం అధిక సంఖ్యలో అభ్యర్థులు వస్తారని అధికారులు కూడా ముందస్తు ప్రణాళికతోనే ఉన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
- See more at: http://sakshi.com/main/FullStory.aspx?catid=633923&subcatid=14&Categoryid=3#sthash.QJnu80do.dpuf

కడప: పంచాయతీ ఎన్నికల ఐదు రోజుల నామినేషన్ల ఘట్టంలో చివరిరోజే మంచిరోజనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు. అందరూ 13వ తేదీ పంచమి ఘడియల్లో నామినేన్లు దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అటు రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థుల గెలుపు ముఖ్యమనే ఉద్దేశంతో ఈ ఘడియలకు ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం కూడా తొలిరెండురోజులు నామినేషన్ల పర్వంలో హడావుడి లేకపోవడానికి కారణమని తెలుస్తోంది.

మొదటి రెండురోజులు స్పందన ఏదీ?
నామినేషన్ల తొలిరోజు 9వ తేదీ జిల్లాలో 53 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ స్థానాలకు 27, వార్డుసభ్యుల స్థానాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులోనూ కడప డివిజన్‌లో 12, రాజంపేట పరిధిలో 7, జమ్మలమడుగు డివిజన్‌లో 6 నామినేషన్లు దాఖలు చేశారు.

తొలిరోజు నామినేషన్లు మందగించేందుకు కారణం ఆషాఢ శుద్ధపాడ్యమి. దీంతో చాలామంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ముందుకు రాలేదు. పైగా 8వతేదీ అమావాస్య కావడంతో 9వతేదీ ఉదయం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. అమావాస్య ఘడియల్లో నామినేషన్లు దాఖలు చేయడం మంచిది కాదనే యోచనతో కొందరు వెనకడుగు వేశారు.

నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉన్న ఐదు రోజుల్లో పంచమి మినహా బుధవారం విదియ కూడా మంచిరోజనే కారణంతో రెండోరోజు నామినేషన్లు కాస్త ఎక్కువగానే దాఖలయ్యాయి. రెండో రోజు బుధవారం సర్పంచ్ స్థానాలకు 512, వార్డు స్థానాలకు 800 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్పంచ్ స్థానానికి 207, వార్డులకు 286. జమ్మలమడుగు పరిధిలో సర్పంచ్ స్థానాలకు 131, వార్డులకు 234, రాజంపేట డివిజన్‌లో సర్పంచ్ స్థానాలకు 174, వార్డులకు 280 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే గురువారం తదియ, శుక్రవారం చవితి...ఈ క్రమంలో శుభముహూర్తంగా భావించే పంచమి ఘడియల్లో నామినేషన్లు దాఖలు చేస్తే విజయం దక్కుతుందనే భావనతో చాలామంది చివరిరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

చివరిరోజుపై అధికారుల ముందస్తు సన్నాహాలు:
జిల్లాలో 785 పంచాయతీలు, 7724 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీటికి నామినేషన్ల దాఖలుకు ‘పంచమిరోజు’ శనివారం అధిక సంఖ్యలో అభ్యర్థులు వస్తారని అధికారులు కూడా ముందస్తు ప్రణాళికతోనే ఉన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

>
మరిన్ని వార్తలు