టీడీపీ నేతపై నాన్‌ బెయిలబుల్ కేసు

4 Aug, 2018 16:09 IST|Sakshi

సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్‌ క్వారీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్‌ 304/11 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు కర్నూల్‌ పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించడంతో పదిమంది మృతి విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వీరభద్ర గౌడ్‌ స్పందించారు. మైనింగ్‌ బ్లాస్టింగ్‌ వలన పేలుడు జరగలేదని, కేవలం జిల్టన్‌ స్టిక్‌ డంపింగ్‌ వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామదర్శిని ప్రజలు అడ్డుకున్నప్పుడే క్వారీపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదని ఆయన అన్నారు. ఘటనపై విచారణ జిరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోస్ట్‌మార్టం
ఘటనలో మరణించిన మృతదేహాలకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఘటనలో చనిపోయిన పది మందిని అధికారులు కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కో మృత దేహానికి ఒక్కో వీఆర్‌వోను నియమించి పంచనామా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు