ఇక నాన్‌స్టాప్‌ ప్రయాణం

21 May, 2020 13:40 IST|Sakshi

నేటి నుంచి ఆర్టీసీ సర్వీసులు

సిటీ పరిధిలో బస్సులకు బ్రేక్‌

ఆన్‌లైన్‌లోనే టికెట్‌ బుకింగ్‌

రీజియన్‌ పరిధి నుంచి 113 సర్వీసులు

ప్రాంతీయ మేనేజర్‌ యేసుదానం వెల్లడి

విశాఖపట్నం/డాబాగార్డెన్స్‌: కోవిడ్‌–19 కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం ఉదయం రోడ్డెక్కనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత చైతన్య చక్రాలు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విశాఖ రీజియన్‌ పరిధి నుంచి 113 బస్సులు నడపనున్నట్లు ప్రాంతీయ మేనేజర్‌ యేసుదానం తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకే బస్సులు తిరగనున్నాయన్నారు. విశాఖ అర్బన్‌ ప్రాంతం కంటైన్‌మెంట్‌ ఏరియాలో ఉండడంతో సిటీ బస్సులు నడపలేమని చెప్పారు. విశాఖ రూరల్‌తో పాటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వరకు బస్సులు నడపనున్నామన్నారు.

సీటు విడిచి సీటు
కరోనా కారణంగా బస్సులో సీటు విడిచి సీటు(కనీసం మూడు అడుగుల దూరం)నుపయాణికులకు కేటాయించారు. ఒక బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఆర్డనరీ బస్సులతో పాటు లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్‌లను తిప్పనున్నారు. ్చpటట్టఛిౌnజీn్ఛ.జీn వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు ఆన్‌లైన్లో బుక్‌చేసుకోవచ్చు.

మధ్యలో ఎక్కడా ఆపరు
టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి. కరెంట్‌ బుకింగ్‌ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లోను బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు. డిపో వద్ద మాత్రమే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడ ప్రయాణికులను బస్సు ఎక్కించుకోరు. 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మాత్రమే అనుమతిస్తారు.

ఎలా అనుమతిస్తారు..
జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుని వద్ద తప్పనిసరిగా ఆధార్‌ కార్డు ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? పూర్తి చిరునామా, ప్రయాణికుడు వెళ్లే ప్రాంతం చిరునామా సేకరించిన తర్వాత థర్మల్‌ స్కాన్‌ తీస్తారు. అన్నీ ఓకే అయితే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ప్రతి ప్రయాణికుడు విధిగా మాస్క్‌ ధరించాలి. శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచనున్నారు.

ఏఏ ప్రాంతాలకు..
జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, చోడవరం, అనకాపల్లి తదితర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని రాజాం, పలాస, పాలకొండ, ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం(నాన్‌స్టాప్‌), పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు.. విజయవాడ, గుంటూరు జిల్లాలకు విశాఖ ద్వారకా బస్‌ స్టేషన్‌ నుంచి బస్సులు పయనం కానున్నాయి.

మధ్యలో ఎక్కడా ఆపరు
కరెంట్‌ బుకింగ్‌ టికెట్లు కూడాఆన్‌లైన్‌లోను బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు.డిపో వద్ద మాత్రమేబస్సు ఎక్కాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడ ప్రయాణికులను బస్సు ఎక్కించుకోరు.

అనుమతి ఇలా...
జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుని వద్ద తప్పనిసరిగా ఆధార్‌ కార్డు ఉండాలి.  
ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారు?  పూర్తి చిరునామా, ప్రయాణికుడు వెళ్లే ప్రాంతం చిరునామా సేకరించిన తర్వాత థర్మల్‌ స్కాన్‌ తీస్తారు.  
అన్నీ ఓకే అయితే ప్రయాణానికి అనుమతి ఇస్తారు.  
ప్రతి ప్రయాణికుడు విధిగా మాస్క్‌ ధరించాలి.  
శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచనున్నారు.

మరిన్ని వార్తలు