వీరెవరూ మాకు నచ్చలేదు

18 May, 2014 02:43 IST|Sakshi

సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదంటూ జిల్లా వ్యాప్తంగా 25,069 మంది ఓటర్లు ‘నోటా’ మీట నొక్కారు. రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులు నచ్చనపుడు ఓటరు తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎన్నికల సంఘం ఈ ఏడాది కొత్తగా నోటా(నన్ ఆఫ్ ది అబౌ-ఎన్‌ఓటీఏ)ను ప్రవేశపెట్టింది. దీంతో జిల్లాలోని ఓటర్లు తమ తిరస్కరణను వెలిబుచ్చుతూ నోటాకు ఓటేశారు.
 
 ఈ మేరకు అనంతపురం పార్లమెంటు పరిధిలో 8,857 మంది, హిందూపురం పార్లమెంటు పరిధిలో 8,284 మంది ఓటర్లు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులను తిరస్కరిస్తూ నోటాను వినియోగించుకున్నారు.   మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అనంతపురం, మడకశిర, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాలు మినహా (వీటి సమాచారం కలెక్టరేట్‌కు అందలేదు) మిగిలిన నియోజకవర్గాల్లో 7,928 మంది ఓటర్లు నోటా మీటను నొక్కి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
 

మరిన్ని వార్తలు