యూటీ ప్రతిపాదన తగదు

22 Nov, 2013 06:57 IST|Sakshi

కందుకూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఆమోదించడం తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి నిదర్శనమని, సీమాంధ్ర నేతలు యూటీ చేయాలనడం అర్థరహితమని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని, భద్రాచలం మాదేనంటూ సీమాంధ్ర నేతలు కుటిల రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. జీఓఎంకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేవలం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉందని, సీమాంధ్రలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరీవాహక ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.  తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని ఈ ప్రాంత ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు.
 
 సీమాంధ్ర నేతలు సమస్యలు సృష్టించకుండా భౌతికంగా విడిపోయి మానసికంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు సురేందర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఈశ్వర్‌గౌడ్, ఇజ్రాయిల్, కృష్ణనాయక్, మహేష్‌గౌడ్, చిర్ర సాయిలు, రాణాప్రతాప్‌రెడ్డి, దశరథ, బాబురావు, శోభ, లత, కరుణాకర్‌రెడ్డి, సమీర్, ఎస్.పాండు, హామీద్, దేవేందర్, కె.పాండు, దర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు