కష్టాల బాటలో తోడుగా

15 May, 2020 11:51 IST|Sakshi

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలు, నిరాశ్రయులు ఉపాధి కోల్పొయి ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తోన్నారు. అటువంటివారిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. కానీ అవి కొంత మందికి చేరుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంధ సంస్థలతో పాటు, సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. (మాతృభూమికోసం చేతనైన సాయం)

సత్తుపల్లి నియోజకవర్గ వైఎస్సార్, జగన్‌మోహన్‌ర్డెడి అభిమానుల ఆధ్వర్యంలో.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం ,మండాలపాడు గ్రామ శివారులో ఛతీజ్ఘడ్ నుండి వలస వచ్చి నివాసముంటున్న 40 కుటుంబాలకు మాస్కులు,  నిత్యవసర వస్తువులు, కూరగాయలు,గుడ్లు ,బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌, జగన్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరవపల్లి సందీప్ గౌడ్,కిషోర్ పోతురాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో జొన్నలగడ్డ వంశీకృష్ణ జక్కంపూడి మరేశ్. ఎం.దయాకర్ రెడ్డి , బల్లి. శ్యామ్ ప్రసాద్, పాణెం.పుల్లారావు ,పాణెం.ఆనంద్, వేణు,  కిశోర్,  రారాజు,  మహేశ్,  రాజు,  రామారావ్,  జొన్నలగడ్డ రాజు బంక వెంకీ సాగర్ గౌతమ్  సాయి తదిరులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్నం పెట్టే వారు లేక రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న వారికి విజయవాడలో ఉంటున్న పసుపులేటి రామ్‌ప్రసాద్‌ అండగా నిలిచారు. వారికి అన్నదానం చేసి వారి ఆకలిని తీర్చి కరోనా కష్టకాలంలో వారికి సాయం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం)

విదేశాలలో ఉంటున్న తన గ్రామాన్ని మర్చిపోకుండా తాను పుట్టిన ఊరిలో లాక్‌డౌన్‌ కారణంగా తిండిలేక అనేకమంది కష్టపడటం చూడలేక అమెరికా నుంచి తన మొత్తం జీతాన్ని పేదవారికి కడుపు నింపడానికి ఉపయోగిస్తున్నాడు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కుంజర్‌ గ్రామానికి చెందిన ఆదీష్‌ అనే యువకుడు తన తండ్రి స్ఫూర్తితో పేదలకుసాయం చేస్తూ ఆదుకుంటున్నాడు.  

కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్‌లు పెట్టుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం ఎంతో అవసరం. అయితే మాస్క్‌ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే చార్టెడ్‌ అకౌంటెంట్‌ మోహాన్‌ కడింపల్లి లక్షా ముప్పై వేల రూపాయల విలువైన 200 పీపీఈ కిట్లను కేడీఎఫ్‌ చెన్నై నుంచి తెప్పించి కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీకి అందజేశారు. వార్డు వాలంటీర్లతో సహా కర్నూల్‌ మున్సిపాలిటీ ఫ్రంట్‌లైన్‌ కార్మికుల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. 

మీరు కూడా లాక్‌డౌన్‌ సమయంలో చేస్తోన్న సేవాకార్యక్రమాలు నలుగురికి తెలిపి వారిలో స్ఫూర్తి నింపాలనుకుంటే webeditor@sakshi.comకి మెయిల్‌ చేయండి.
 

మరిన్ని వార్తలు