రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు

15 Jul, 2013 16:42 IST|Sakshi

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఆ ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అల్పపీడనం ఒడిశా నుంచి తమిళనాడుకు ఆవరించి ఉంది. దాంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. అయితే సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు