నార్వేను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

2 Feb, 2017 16:30 IST|Sakshi
నార్వేను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

అమరావతి: మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం ఆర్ధిక, ప్రణాళిక శాఖల సంయుక్త సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఫలిత ఆధారిత బడ్జెట్ ను రూపొందించాలని అధికారులకు సూచించారు. అయిదు అంశాల ఆధారంగా బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని, సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆరో తేదీన నిర్వహించే కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశం అజెండాపైనా చర్చించినట్లు సమాచారం.

ప్రజలు పన్నులు చెల్లించిన నిధులనే ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తోందని, కేటాయింపులు ప్రాధాన్యతా క్రమంలో ఉండాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్రం సహాయం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో లక్ష్య సాధనను నిర్దేశించుకోవాలని చెప్పారు.

మరిన్ని వార్తలు