'పీసీసీ చీఫ్ అన్నది పదవి కాదు...బాధ్యత'

13 Mar, 2014 16:21 IST|Sakshi
'పీసీసీ చీఫ్ అన్నది పదవి కాదు...బాధ్యత'

హైదరాబాద్ : పీసీసీ చీఫ్ అన్నది తాను పదవిగా భావించటంలేదని, బాధ్యతగా అనుకుంటానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్లో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు... ఎన్నికల సమయంలో పార్టీని వీడారన్నారు. పార్టీని వీడుతున్నవారు ఒకసారి పునరాలోచన చేయాల్సిందిగా రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనుక్షణం తన బాధ్యతను గుర్తెరిగి పని చేస్తానని ఆయన తెలిపారు.

పార్టీలో ఇంకా మిగిలి ఉన్న నిజాయితీగల కార్యకర్తల సహకారంతో కలిసి పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తానని అధిష్టానంతో చెప్పానన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమైనదని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని బిల్లులో చేర్చడం జరిగిందన్నారు. కాగా  ఆంధ్రపద్రేశ్కు తొలి పీసీసీ అధ్యక్షుడుగా నియమించినందుకు రఘువీరారారెడ్డి ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్లకు ధన్యవాదాలు తెలిపారు.  కాగా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రెస్మీట్ను హోటల్లో నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు