గిరిజనుల ప్రాణాలకు భరోసా లేదు

26 Aug, 2014 00:40 IST|Sakshi
గిరిజనుల ప్రాణాలకు భరోసా లేదు

పార్వతీపురం/కురుపాం: కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి, గిరిజనుల ప్రాణాలను కాపాడాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అ సెంబ్లీలో ప్రస్తావించిన విషయూలను ఫోన్‌లో ఇక్కడి విలేకరులకు వివరించారు. 2008లో సుమారు రూ.3.5కోట్ల రాష్ట్రీయ సమ వికాస్ యోజన(ఆర్‌ఎస్‌వీవై) పథకం నిధులతో అప్పటి అటవీశాఖా మంత్రి శత్రు చర్ల విజయరామరాజు  పూర్ణపాడు-లాభేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణానాకి శంకుస్థాపన చేశారని, అప్పట్లో దీనినిర్మాణ బా ధ్యతలు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లకు అప్పగించారని తెలిపారు. వారు ఏడాది తర్వాత అంచనాల మొత్తం చాల దంటూ నిర్మాణాన్ని నిలుపుదల చేసినట్టు చెప్పారు.
 
 అనంతరం రూ.5.25 కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌అండ్ బీ నేచురల్ హెల్పింగ్ హేండ్స్‌కు నిర్మాణ బాధ్యతలు అప్ప గించారని, వారు కూడా పనులు చేపట్టలేకపోవడం తో 2009లో రూ.6కోట్ల నిర్మాణ వ్యయంతో ఆర్‌అండ్‌బి రెగ్యులర్‌కు అప్పగించినట్టు వివరించారు. వారు కూడా పనులు చేపట్టలేకపోవడంతో రూ.3.5 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేశారన్నారు. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఈవై నిధులు 3.5కోట్లు మొ త్తం రూ.7 కోట్ల నిర్మాణ వ్యయంతో పలుమార్లు టెండర్లు జరిగినా..ఇప్పటివరకు పనులు జరగలేదన్నారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఏటా వర్షాకాలంలో గిరిజ నులు నరకయూతన అనుభవిస్తున్నారన్నారు.
 
 వంతెన లేకపోవడంతో 1996లో కూనేరు వద్ద నాటు పడవ మునిగి 33 మంది మృత్యువాత పడిన విషయూన్ని గుర్తు చేశారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాలతో పాటు ఒడిశాకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. అంతేకాకుండా సుమారు 30 గ్రామాల ప్రజలకు 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గి మండల కేంద్రానికి రాకపోకలకు చేసేందుకు వీలవుతుందన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ విషయూన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, తమహయాంలో వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు శతవిధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు.
 

మరిన్ని వార్తలు