అర్హులకు ఇవ్వరా?

28 Feb, 2014 23:56 IST|Sakshi

 కొండపాక, న్యూస్‌లైన్:  ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాలిస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే పేద ప్రజలకు ఇవ్వకుండా అనర్హులకు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడంపై మండలంలోని కుకునూర్‌పల్లి మహిళలు, పేదలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కుకునూర్‌పల్లిలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా ల్గొనడానికి తహశీల్దార్‌ప్రమీల, మండల ఈఓఆర్‌డీ సుబ్రహ్మణ్యమూర్తి, ఏఓ భోగేశ్వర్ తదితర అధికారులు గ్రామానికి చేరుకున్నారు.

కార్యాలయంలో అధికారులు గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న మహిళలు, గ్రామస్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు.   ఎక్కడో రాజస్తాన్ నుం డి ఏడాది కిందట వచ్చిన స్వీట్‌హోమ్ వ్యాపారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఏ లెక్కన ఇచ్చారని నిలదీశారు.  వరంగల్ జిల్లాకు చెందిన ఒక చిరువ్యాపారి ఆరు నెలల కిందట గ్రామానికి వలస రాగా అతనికి కూడా ప్లాటు ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. అర్హులైన పేద లు దశాబ్దానికి పైగా ఎదురు చూస్తుం డగా స్థానికేతరులకు ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పంచిన పట్టా సర్టిఫికెట్లను అధికారులు వెంటనే వెనక్కి తీసుకొని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

 గ్రామస్థుల ఆందోళనకు కొండపాక మాజీ జడ్పీటీసీ సభ్యుడు తూం అంజిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ దశాబ్దం కింద పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం చాకలి నారాయణ అనే వ్యక్తి దగ్గర 662, 783 సర్వేనెంబర్లలోని ఒకటిన్నర ఎకరాల భూమి ని కొనుగోలు చేసిందన్నారు. పేదలు చాలా మంది ఇళ్లస్థలాల కోసం గతంలోనే అర్జీలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారన్నారు. కాగా ప్రభుత్వం సేకరించి న భూమిని గ్రామానికి చెందిన ఒకరిద్దరు కలిసి ఇష్టారీతిగా పంచిపెట్టారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొ ని అర్హులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. లేకుంటే అక్కడ జరిపే నిర్మాణాలను మహిళలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికి తహశీల్దార్ ప్రమీల స్పందిస్తూ తాను క్తొతగా వచ్చాననీ, విషయాన్ని పూర్తిగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు