ఆదిత్యుని పాదాలను ‘తాకని’ సూర్యకిరణాలు

9 Mar, 2017 10:01 IST|Sakshi
అరసవల్లి (శ్రీకాకుళం జిల్లా): అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం ఉదయం సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకలేదు. ప్రతి యేటా మార్చి 8,9,10 తేదీలలో సూర్యోదయంలో కనిపించే సూర్యకిరణ దర్శనం బుధ,గురువారాల్లో మేఘాల కారణంగా సాధ్యపడలేదు.  
 
సూర్య కిరణాలు ఆదిత్యుడి పాదాలను తాకే తరుణాన్ని వీక్షిద్దామని వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులంతా నిరాశతో వెనుదిరిగారు.ఈ ఆలయం లో సూర్యని కిరణాలు నేరుగా సూర్యదేవుని అరుణశిల విగ్రహం పై పడి దేవదేవుడు బంగారు వర్ణంలో మెరిసిపోతాడు. ప్రతి ఏటా మార్చి నెలలో మూడు రోజులు, అక్టోబరు నెలలో మూడు రోజులు ఇలా కిరణాలు దేవుని విగ్రహాన్ని తాకుతాయి. ఈ సమయంలో దేవుని దర్శనం చేసుకుంటే ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రేపు కిరణాలు పడే అవకాశం ఉండటంతో ఇతరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆదిత్యుని దర్శనం కోసం  నిరీక్షించనున్నారు.
మరిన్ని వార్తలు