అతలాకుతలం

25 Oct, 2013 01:11 IST|Sakshi

అన్నదాతను భారీ వర్షాలు హై అలర్ట్
 = 40,625 ఎకరాల్లో పత్తికి నష్టం
 = 22,500 ఎకరాల్లో వరి నీటమునక
 =1,375 ఎకరాల్లో మొక్కజొన్న, 1,250 ఎకరాల్లో వేరుశనగకు నష్టం
 =పొంగిపొర్లుతున్న వాగులు
 = చలిగాలులకు ఒకరు మృతి
 = స్తంభించిన జనజీవనం
 =మరో 24 గంటలపాటు వర్షాలు

 అన్నదాతను భారీ వర్షాలు నిలువునా ముంచాయి. ఖరీఫ్ దిగుబడులపై రైతులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లాయి. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంట తడిసిపోవడంతో ఆయా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనేక ప్రాంతాల్లో వరిపైరు నీటమునిగింది. మొక్కజొన్న, పసుపు, వేరుశనగ, కూరగాయల పంటలకూ నష్టం తప్పలేదు.  వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేకచోట్ల రోడ్లపైకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. మచిలీపట్నంలో చలిగాలులకు వృద్ధుడు మృతిచెందాడు.
 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. గురువారం నాడూ జిల్లా అంతటా భారీ వర్షాలు కొనసాగాయి. జిల్లాలోని నందిగామ, మైలవరం, నూజివీడు, మైలవరం, తిరువూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో 1.37 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 వేల 625 ఎకరాల్లోని పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతం పత్తి మొదటి, రెండోతీత దశలో ఉందని రైతులు చెబుతున్నారు. రెండోతీతలో ఎకరానికి కనీసంగా మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ఈ మొత్తం వర్షానికి తడిచిపోవటంతో ఎకరానికి కనీసంగా రూ.10 వేలు నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. విచ్చుకున్న పత్తి తడిచిపోగా కాయల్లోకి నీరు చేరి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడిసిన పత్తి రంగు మారిపోతోందని వాపోతున్నారు. పత్తి పొలాల్లో నీరు నిలవటంతో మొక్కలకు వేరు కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మైలవరంలోని తుళ్లూరు, మందాపురం, పైరుపాడు తదితర ప్రాంతాల్లో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీయటంతో పత్తి మొక్కలు నేలవాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మరింతగా కురిస్తే నష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 
22,500 ఎకరాల్లో వరి నీటమునక

సముద్రతీరంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ, పమిడిముక్కల, మోపిదేవి తదితర మండలాల్లో గత నాలుగు రోజులుగా భారీ వర్షం కురిసింది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో 50 వేల ఎకరాల ఆయకట్టు రత్నకోడు డ్రెయిన్ పరిధిలో ఉంది. ఈ డ్రెయిన్ అవుట్‌ఫాల్ స్లూయిస్ గేట్లు తెరుచుకోకపోవటంతో వర్షపునీరంతా పొలాలను ముంచెత్తింది. అధికారులు తగు చర్యలు తీసుకోకపోవటంతో ఈ మండలాల్లోని వరిపొలాలు నీటమునిగాయి. వైఎస్సార్ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ సొంత ఖర్చులతో ఈ గేట్లను గురువారం తెరిపించారు.

ప్రస్తుతం వరి పొట్ట, ఈత, కంకులు పాలు పోసుకోవటం, సుంకుపోసుకునే దశల్లో ఉన్నాయి. భారీవర్షాల ప్రభావంతో పొలాల్లోకి నీరు చేరి పైరు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. పొట్టదశలో ఉన్న పైరు మూడు రోజులకు మించి నీటిలోనే ఉంటే కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. సుంకు పోసుకునే దశలో ఉన్న పైరు ఈదురుగాలుల తాకిడికి సుంకు రాలిపోతే తప్ప, తాలు కంకులు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మరింతగా కురిస్తే వరి పైరుకు పెనుప్రమాదం ఉందని చెబుతున్నారు. జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు, మునగపాడు తదితర గ్రామాల్లో మొక్కజొన్న వర్షానికి తడిచి మొలకెత్తాయి. 1,375 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

నూజివీడు, బందరు తదితర ప్రాంతాల్లో దాదాపు 1,250 ఎకరాల్లో వేరుశనగ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 22,500 ఎకరాల్లో పసుపు సాగు జరగగా భారీ వర్షాలు కురిసి పసుపుతోటలో నీరు నిలబడితే పంట దెబ్బతింటుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. నందిగామ, చందర్లపాడు తదితర ప్రాంతాల్లో సాగు చేసిన మిరప పంటకు వర్షం నష్టం కలిగించిందని అధికారులు చెబుతున్నారు.
 
5.35 సెంటీమీటర్ల సగటు వర్షపాతం

 జిల్లాలో గురువారం ఉదయం 11.30 గంటల సమయానికి 5.35 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మొవ్వలో అత్యధికంగా 12.9, పమిడిముక్కలలో 11.7, మోపిదేవిలో 11.5, అవనిగడ్డలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో కోడూరు, ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులను గ్రామాల్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని కలెక్టర్ రఘునందనరావు సమీక్షిస్తున్నారు.

మరో 24 గంటలపాటు జిల్లా నలుమూలలా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. మోపిదేవి మండలం బోడగుంట, అవనిగడ్డ 8వ వార్డుతో పాటు జిల్లాలోని మరో నాలుగు ప్రాంతాల్లో గృహాలు కూలిపోయాయి. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం, నిడమర్రు, పల్లెపాలెం, మాట్లం గ్రామాల్లో నాలుగు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొమాళ్లపూడి, చినగొల్లపాలెం, పల్లెపాలెం గ్రామాల్లో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

 రాకపోకలు బంద్

 భారీ వర్షాల కారణంగా వైరా నది దాములూరు వద్ద పొంగి పొర్లటంతో కంచికచర్ల, వీరులపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముప్పాళ్ల గ్రామం వద్ద నల్లవాగు, చందర్లపాడు వద్ద గుర్రాల వాగు, అడవిరావులపాడు వద్ద నల్లవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ మార్గాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పొంగి ప్రవహిస్తున్న వాగులను విజయవాడ సబ్‌కలెక్టర్ హరిచందన పరిశీలించారు. మండవల్లి మండలం పెనుమాకలంక - మణుగూరుల మధ్య కొల్లేరు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

గుడివాడ పట్టణంలోని కొమరగుండం కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుపోవటంతో అధికారులు పునరావాస శిబిరం ఏర్పాటుచేశారు. గూడూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి కొబ్బరిచెట్టు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బంటుమిల్లి మండలం బంటుమిల్లిలో చెట్టు విరిగి పడటంతో టీకొట్టు నిర్వహించే రాజస్థాన్‌కు చెందిన 18 ఏళ్ల కుషియా తీవ్ర గాయాలపాలయ్యాడు. అతను ప్రస్తుతం బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గన్నవరంలోని చీమలవాగు, బొబ్బవాగు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఉంగుటూరు మండలంలో మున్నేరు పొంగి ప్రవహిస్తుండటంతో తేలప్రోలు, ఉయ్యూరుల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వాగులు, డ్రెయిన్లు పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్‌సిబ్బందిని ఇరువైపులా ఉంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బందరు మండలంలోని గుండేరు, శివగంగ డ్రెయిన్లు, గూడూరు మండలంలోని లజ్జబండ, కృత్తివెన్ను మండలంలోని ఉప్పుటేరు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఎగువ నుంచి వర్షపునీరు మరింతగా వచ్చే అవకాశం ఉండటంతో శుక్రవారం నాటికి తీరంలోని పంటపొలాలు మరింత మునకబారిన పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలిగాలులకు తాళలేక మచిలీపట్నం రాజుపేట వర్రేగూడేనికి చెందిన రిక్షా కార్మికుడు ఎలిశెట్టి సోములు (65) గురువారం మృతిచెందాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

నిలువునా ముంచాయి. ఖరీఫ్ దిగుబడులపై రైతులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లాయి. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంట తడిసిపోవడంతో ఆయా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనేక ప్రాంతాల్లో వరిపైరు నీటమునిగింది. మొక్కజొన్న, పసుపు, వేరుశనగ, కూరగాయల పంటలకూ నష్టం తప్పలేదు.  వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేకచోట్ల రోడ్లపైకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. మచిలీపట్నంలో చలిగాలులకు వృద్ధుడు మృతిచెందాడు.
 
మరిన్ని వార్తలు