ఇక.. చిటికెలో పాస్‌పోర్ట్

2 Jul, 2014 08:29 IST|Sakshi
ఇక.. చిటికెలో పాస్‌పోర్ట్

‘సాక్షి’తో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డా॥శ్రీకర్‌రెడ్డి
ఈసేవ, మీసేవల్లోనూ దరఖాస్తులు
ఇరు రాష్ట్రాల్లోనూ 6,600 కేంద్రాలు
కోత్త పాస్‌పోర్ట్ కార్యాలయం కోసం పరిశీలన
ఇరాక్‌లోని తెలుగువారికోసం ఇద్దరు అధికారుల బృందం
ఆచూకీ చెబితే స్వదేశానికి ఉచిత ప్రయాణ ఏర్పాట్లు

 
హైదరాబాద్: విదేశీ ప్రయాణాలకు ప్రాణప్రదం వంటి ‘పాస్‌పోర్ట్’ను పొందడం ఇక సులభమేనని, దీనిని పొందడంలో సాధారణ ప్రజలకు ఇప్పటి వరకు ఉన్న ‘చాలా కష్టం’ అనే భావాన్ని తుడిచిపెట్టే దిశగా అనేక చర్యలు చేపట్టామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డా’’ శ్రీకర్‌రెడ్డి తెలిపారు. పాస్‌పోర్టు దరఖాస్తు మొదలు దానిని పొందడం వరకు ఉన్న అంశాలను సోమవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని వారికి కూడా పాస్‌పోర్టు సులభంగా లభించేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్, ఆధార్, డ్రైవింగ్ లెసైన్సుల కంటే సులభంగా పాస్‌పోర్ట్ సేవలు అందించనున్నట్టు వివరించారు. పాస్‌పోర్టు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేనివారికి ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉం చామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 6,600లకు పైగా ఉన్న ఈ- సేవ, మీ-సేవల్లో రూ. 100 చెల్లించి దరఖాస్తు పొందవచ్చన్నారు.  

పలు అంశాలు ఆయన మాటల్లోనే..

 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా తెలంగాణలో 3,200, ఏపీలో 3,400 ఈ-సేవ, మీసేవ కేంద్రాలున్నాయి. వీటినే కామన్ సర్వీస్ సెంట ర్లుగా ఉపయోగించి రూ.100 చెల్లిస్తే పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు.ఆయా కేంద్రాలకు పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్‌ను అనుసంధానిస్తున్నాం. దీనికోసం 2 వేల మందికి ప్రత్యేక శిక్షణ నిస్తున్నాం. ఇవి ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

  అన్ని సెంటర్లలోనూ పాస్‌పోర్టు దరఖాస్తుకు ఏమేమి ధ్రువపత్రాలు కావాలో బోర్డును, నిరక్షరాస్యుల కోసం ఓ వ్యక్తిని నియమించాం. ఇక్క డ అమలయ్యే విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో మరిన్ని దరఖాస్తు కౌంటర్లు పెంచుతున్నాం. రోజూ 500 మందికి పైగా అదనంగా దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. త్వరలోనే భీమవరం మినీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి రానుంది.
 
అత్యవసరంగా పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారికి తక్షణమే స్పందించే ఏర్పాటు చేశాం. అమెరికాకు చదువుకోసం వెళ్లేవాళ్లకు, ఉద్యోగం కోసం, బిజినెస్ పనిమీద వెళ్లేవారికోసం ఇలా ఏ పని మీదైనా వెళ్లేందుకు సం బంధిత ధ్రువపత్రాలు చూపిస్తే ఒకటి రెండు రోజుల్లో పాస్‌పోర్ట్ ఇస్తాం. ఆంధ్రపదేశ్‌లో కొత్త పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు పరిశీలనకు త్వరలోనే ఢిల్లీ నుంచి బృందం రాబోతోంది. ఇప్పటికే పాస్‌పోర్టు వికేంద్రీకరణ జరిగిన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్న కార్యాలయం సరిపోతుందా, మరొకటి ఏర్పాటు చేయాలా అన్న కోణంలో పరిశీలించే అవకాశం ఉంది.
 
 

మరిన్ని వార్తలు