నేత్రపర్వంగా వెంకన్న రథోత్సవం

27 Feb, 2014 03:44 IST|Sakshi
నేత్రపర్వంగా వెంకన్న రథోత్సవం

చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాసమంగాపురంలోని కల్యా ణ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం అశేష భక్తజ న సందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేక అ లంకరణలో ఉన్న స్వామిని తిలకించిన భక్తులు పులకిం చి పోయారు. అంతకు ముందు ఆలయంలో తెల్లవారు జామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వాహన మండపంలో కొలువుంచి తిరుమంజన సేవ నిర్వహించారు. అభిషేకితులైన స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకారమూర్తులైన స్వామి అమ్మవార్లు రథంపై కొలువయ్యారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడు మ స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది.

ఆలయ మాడా వీధుల్లో విహరించిన స్వామికి భక్తులు దారిపొడవునా కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ కన్నులపండువగా జరిగింది. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెం డెంట్ ధనంజయ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు