నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 2.5 లక్షలు

13 Jul, 2020 05:44 IST|Sakshi

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టీటీడీ ఈవో సింఘాల్‌    

తిరుమల: లాక్‌డౌన్‌ సడలించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభమైన జూన్‌ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ..  
4    శ్రీవారి దర్శనం కోసం జూన్‌ 11 నుంచి జూలై 10 మధ్య ఆన్‌లైన్‌Œ  ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోగా 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకోగా అందులో 85,434 మంది దర్శనానికి వచ్చారు.  
4    నెల రోజుల్లో హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు లభించింది. 13.36 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 
4    మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  
4    జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. టీటీడీ ఉద్యోగుల్లో 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.  

మరిన్ని వార్తలు