ఎమ్మెల్యే రోజాపై అసభ్య పోస్టింగ్‌లు.. ఫిర్యాదు

19 Dec, 2019 19:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్‌కే.రోజాతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, పార్టీ మహిళా కార్యకర్తలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఒక ఫిర్యాదును రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ రవిశంకర్‌కు గురువారం అందజేశారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళా నేతలపై అభ్యంతరకరమైన దూషణలతో కూడిన పోస్టింగ్‌లు పెట్టడం అవమానకరమని పేర్కొన్నారు.

అసభ్య పోస్టులు పెట్టే వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన అదనపు డీజీపీ నిందితులు ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, ఏపీ మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఇతర నేతలు జమ్మలమడక నాగమణి, బొట్టా కనకదుర్గ ,సుధారాణి, హిమబిందు, అనిత, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మి ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు

ప్రజాభిప్రాయ సేకరణ జరపండి

విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు తారుమారు

కూరగాయల రవాణాకు అనుమతి 

రైళ్ల పునఃప్రారంభంపై 12 తర్వాతే నిర్ణయం 

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ